రివ్యూ :- సూర్య ‘ఆకాశం నీ హద్దురా’..!!

తమిళం సూపర్ డూపర్ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వం వహించిన చిత్రం ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సూర్య ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో హీరోయిన్ గా అపర్ణ బాలమురళి నటించింది. జి.వి.ప్రకాష్ మ్యూజిక్ అందించారు. సినిమాలో మోహన్ బాబు, పరేష్ రావల్ కూడా కీలక క్యారెక్టర్లు చేశారు. ఓ యదార్థ సంఘటన కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం…

స్టోరీ:

చంద్ర మహేష్ పాత్రలో నటించిన సూర్య ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత సొంతంగా ఓ విమానయాన సంస్థ స్థాపించాలని ఆలోచన చేస్తాడు. ఒక్క రూపాయికే నిరుపేదలకు కూడా విమాన ప్రయాణాలు అందుబాటులో ఉండాలని అతని డ్రీమ్. అందుకు తగిన అత్యద్భుతమైన ఐడియా అతని దగ్గర ఉంటుంది. కానీ సూర్య చేసిన ఆలోచనకు ప్రభుత్వాలు బ్యాంకులు అదేవిధంగా బడా బడా వ్యాపారవేత్తలు అడ్డుపడతారు. ఇక విలన్ అయిన పరేష్ రావల్ స్థాపించిన అతిపెద్ద ఎయిర్ వేస్ సంస్థ సూర్య ఐడియా కు అడ్డుకట్ట వేస్తూ ఉంటుంది. ధనవంతుడికి దరిద్రుడికి మధ్య ఉన్న రేఖ ను మరొక దరిద్రుడు వచ్చి తుడిచివేయడానికి వీలు కాకూడదు అని అతనికి ప్రతి దశలో అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఇదిలా ఉండగా అసలు సూర్య కి రోడ్డు మీద నడిచే పేద వాడిని విమానం ఎక్కించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? అందుకోసం అతను ఎందుకు అంత కష్టపడతాడు? ఈ విషయంలో అతని భార్య అందించిన సహకారం ఎలాంటిది శత్రువులను…ఏ విధంగా మిత్రులుగా మార్చుకున్నాడు అనేదే ఈ సినిమా యొక్క స్టోరీ.

ప్లస్ లు :

సూర్య నటన

హీరో, హీరోయిన్ కెమిస్ట్రీ

బలమైన కథనం, ఎమోషన్స్

క్లైమాక్స్

సుధ కొంగర టేకింగ్

ఎడిటింగ్

మైనస్ లు :

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

స్క్రీన్ ప్లే

సీన్ సీన్ లో సాంబార్ వాసన

సూర్య ముందు తేలిపోయిన సైడ్ క్యారెక్టర్స్

విశ్లేషణ :

చాలా కాలం తర్వాత సూర్య కి తగ్గ స్టోరీ సినిమా వచ్చిందని చెప్పవచ్చు. బలమైన కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నీ డైరెక్టర్ సుధ కొంగర డైరెక్షన్ అదరగొట్టింది అని చెప్పవచ్చు. సినిమాలో సూర్య నటన పిక్స్ మనిపించింది. ముఖ్యంగా హీరోయిన్ అపర్ణ కి సూర్య కి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్ అని చెప్పాలి. సినిమా చివరి 20 నిమిషాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించే రీతిలో స్టోరీని నడిపించే తీరు అత్యద్భుతం. హీరోయిన్ మినహా మిగతా క్యారెక్టర్లు స్టొరీ కి తగ్గ ఎమోషన్ నడిపించడంలో కొద్దిగా తడబడి నట్లు ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన మోహన్ బాబు క్యారెక్టర్ తక్కువ టైం ఉన్నాగాని తమిళ టేకింగ్ కు అతను సరిగ్గా ఇమిడినట్టు కనిపించలేదు. జి.వి.ప్రకాష్ పాటలు చాలా బాగున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అతని స్థాయికి తగ్గట్టు లేదు. స్క్రీన్ప్లే మరి కొంత ఆసక్తికరంగా ఉండవచ్చు. మొత్తం మీద సినిమా చాలావరకు వన్ మాన్ ఆర్మీ గా సూర్య పండించే ఎమోషన్స్ అదేవిధంగా దర్శకత్వ శైలి బట్టి మిగిలిన అంశాలు పెద్దగా డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు.
…. పాంచజన్య