కరోనా వ్యాక్సిన్‌ పై పుతిన్ కీలక ప్రకటన..!

వాస్తవం ప్రతినిధి: కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. తొందరలోనే తాము మూడవ వ్యాక్సిన్‌ రిజస్టర్‌ చేయనున్నట్టు పుతిన్‌ వెల్లడించారు. అలాగే రష్యా తయారు చేస్తున్న వాక్సిన్లు అన్నీ ప్రభావవంతంగా ఉన్నాయని మంగళవారం ప్రకటించారు. అలాగే వ్యాక్సిన్ల తయారీలో ఇతర అన్ని దేశాలకు సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.