మహేష్ కి అవి అంటే బాగా ఇంట్రెస్ట్ తెలియజేసిన మంజుల..!!

వాస్తవం సినిమా: మహేష్ సోదరి మంజుల ఇండస్ట్రీలో నిర్మాతగా అదేవిధంగా నటిగా రాణించిన సంగతి తెలిసిందే. నటిగా పెద్దగా ఆకట్టుకోలేక పోయినా కానీ నిర్మాతగా మాత్రం మంజుల చాలావరకు విజయాన్ని అందుకోవడం జరిగింది.

ఇదిలా ఉండగా ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా కొన్ని విషయాలు ఓ ప్రముఖ వెబ్ మీడియా చేసిన ఇంటర్వ్యూలో తెలిపింది. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి అనేక విషయాలు ఇంటర్వ్యూలో మంజుల చెప్పుకొచ్చారు.

చిన్ననాటి నుండి హెల్త్ విషయంలో ఇంటిలో కృష్ణ గారు చాలా జాగ్రత్తలు తీసుకునే వారిని ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి వంటి విషయాలలో నిక్కచ్చిగా ఉండే వారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఫిట్నెస్ ఎలా కాపాడుకోవాలో అన్ని విషయాలు  నాన్నగారు నుండి నేర్చుకున్నట్లు మంజుల చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉండగా మహేష్ గురించి మంజుల ప్రస్తావిస్తూ…  ఫిట్ నెస్ తో పాటుగా అధ్యాత్మిక విషయాల పట్ల మహేశ్ కు మంచి అవగాహన ఉందని మంజుల తెలిపారు. కాగా ప్రతి విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటారని ఆమె తెలిపారు. అతనితో నేను కూడా అనేక విషయాల గురించి చర్చిస్తానని మంజుల తెలిపారు. అలాగే వారి చిన్న నాటి మధుర జ్ఞాపకాలను కూడా గుర్తుచేసుకున్నారు. మహేశ్ తో ఒక సినిమాను తీసేందుకు ప్రయత్నిస్తున్నానని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.