నిబంధనలతో ..ఆర్జీవీ ‘మ‌ర్డ‌ర్’ మూవీ విడుద‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్

వాస్తవం సినిమా: సంచలనం సృష్టించిన ప‌రువు హ‌త్య ప్ర‌ణ‌య్ – అమృత‌ల నేప‌థ్యంలో వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన మ‌ర్డ‌ర్ మూవీ విడుద‌ల‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది..అయితే ఈ మూవీలో ఎక్క‌డ కూడా అమృత, ప్ర‌ణయ్, మారుతీరావు పేర్ల‌ను వాడ‌వ‌ద్ద‌నే నిబంద‌న విదించింది.. వారి పేర్లు లేకుండా సినిమా విడుద‌ల‌కు హైకోర్టు అనుతించింది.. ఈ తీర్పుపై ద‌ర్శ‌కుడు వ‌ర్మ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.. కోర్టు తీర్పును తాము గౌర‌విస్తామ‌ని పేర్కొంటూ కోర్టు ష‌ర‌తుల‌ను పాటిస్తూ మూవీని విడుద‌ల చేస్తాన‌ని ట్విట్ట‌ర్ లో ట్విట్ చేశాడు..