అభిమానికి వీడియో కాల్ చేసి మరి ధైర్యం చెప్పిన జూనియర్ ఎన్టీఆర్..!!

వాస్తవం సినిమా: ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో అభిమానులను ఎక్కువగా ప్రేమించే స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్. చాలా సందర్భాలలో తన అభిమానులకు జాగ్రత్తలు చెబుతూ.. వాళ్లు ఇంటికి వెళ్లే సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని ఆడియో వేడుకలలో ప్రి రిలీజ్ సందర్భాలలో తన ప్రేమను చాటడం మనకు తెలిసిందే. అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధమవుతాడు.

ఇదిలా ఉండగా ఇటీవల ఓ అభిమాని ఎన్టీఆర్ తో ఫోటో దిగాలని మంచం మీద చాలా దీనస్థితిలో అనారోగ్యంతో ఉన్న సమయంలో పోవటంతో ఈ విషయం జూనియర్ ఎన్టీఆర్ కి తెలియటంతో వెంటనే అతనికి వీడియో కాల్ ఫోన్ చేసి ధైర్యం చెప్పాడు. పూర్తి వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా చండూరు గ్రామానికి చెందిన వెంకన్న జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని.

అయితే కొద్ది రోజుల క్రితం ఆయనకు ఓ ప్రమాదం జరగడంతో స్పైనల్ కార్డు దెబ్బతింది. అయితే జీవితంలో ఎన్టీఆర్‌ను ఒకసారైనా కలిసి ఫోటో దిగాలన్న కోరిక వెంకన్నలో బాగా ఉండేది. ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చేందుకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. ఈ కరోనా గోల అంత తగ్గిపోయాక నువ్వు బాగుపడిన తర్వాత ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం అని మాట ఇచ్చాడు. ధైర్యంగా ఉండు నా వంతు సహాయం నేను చేస్తాను అని ఆ అభిమానికి ఎన్టీఆర్ ఫోన్ చేసి మరి వీడియో కాల్ లో మాట్లాడటంతో సదరు అభిమాని ఆనందానికి అవధులు లేవు.