ఆటోడ్రైవర్ పై వైసీపీ కార్యకర్తలు దాడి..!!

వాస్తవం ప్రతినిధి: అధికారంలో ఉన్నాం కదా అని తెగ రెచ్చిపోతున్నారు వైసిపి పార్టీకి చెందిన నేతలు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల దళితులపై భారీ స్థాయిలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా దాడులు జరుగుతూ ఉన్నా గాని ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వస్తుంటే, ఇప్పుడు ఏకంగా ఆటో డ్రైవర్లపై కూడా దాడులు స్టార్ట్ కావడం దీంతో వైసీపీ పై విమర్శలు సామాన్య జనం నుండి భారీస్థాయిలో వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే కర్నూలు జిల్లా ఆదోనిలో ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వాహనం ఆలూరు రోడ్డుపై వెళ్తుండగా.., అక్కడే ఉన్న ఆటో డ్రైవర్ రవి కామెంట్స్ చేశాడు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, అతనికి సమస్య అర్ధం కావాలంటే ఎమ్మెల్యే వాహనం ఈ గుంతల్లో ఇరుక్కోవాలని విమర్శించాడు. పక్కనే ఉన్న వైసీపీ అభిమానులు ఆటో డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. వెంటనే అతన్ని లాక్కెళ్ళి శిల్పా ఎస్టేట్ ప్రాంతం దగ్గర దారుణంగా చితకబాదారు. ఈ విషయం మీడియాలో రావడంతో ఎమ్మెల్యే వెంటనే బాధితుడిని పరామర్శించి…ఖచ్చితంగా ఆలూరు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే సామాన్య జనం ఈ విషయం తెలుసుకుని ఆటోడ్రైవర్ పై దాడిని ఖండించారు. అధికార మదం వల్లే ఈ విధంగా వ్యవహరించడం దారుణమని వైసీపీ కార్యకర్తల పై మండి పడుతున్నారు.