వాస్తవం ప్రతినిధి: బీహార్ సీఎం నితీశ్ పై జరిగిన ఉల్లిగడ్డల దాడిని మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ ఖండించారు. నిరసన తెలపడానికి వివిధ రకాలైన ప్రజాస్వామ్య పద్ధతులున్నాయని హితవు పలికారు. ఈ సంఘటనను ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ద్వారా నిరసన తెలిపే అవకాశం ఉంది. అది జరగాల్సిన ఘటన కాదు. ఇది ఎంత మాత్రమూ సమంజసం కాదని తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మధుబనీ ప్రాంతంలో సీఎం నితీశ్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయనపై ఉల్లిగడ్డలతో దాడికి దిగారు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది… ఆయన చుట్టూ రక్షణ కవచంలా నిలబడ్డారు. దీంతో ఇదంతా విపక్షాల కుట్ర అని ఆరోపించారు.