న్యూయార్క్‌లో బైడెన్ గెలుపు .. పెన్సిల్వేనియాలో ట్రంప్‌ ఆధిక్యం..!

వాస్తవం ప్రతినిధి: ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడి సొంత రాష్ట్రమైన న్యూయార్క్‌లో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుపొందారు. 29 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో జో బైడెన్‌కు 37.89లక్షల ఓట్లు పోలవగా.. డొనాల్డ్ ట్రంప్ కేవలం 29.56లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. జో బైడెన్ సొంత రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం కనబరుస్తున్నారు. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్‌కు 29.65లక్షల ఓట్లు పడగా.. బైడెన్‌కు 22.90లక్షల ఓట్లు లభించాయి. పెన్సిల్వేనియాలో పోలైన ఓట్లలో ఇప్పటి వరకు 64 శాతం ఓట్లను లెక్కించారు.