దాదాపు 8 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్న సిద్ధార్థ.!!  

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో లవర్ బాయ్ గా వెలుగు వెలిగాడు హీరో సిద్ధార్థ. బాయ్స్ సినిమాతో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్థ దక్షిణాదిలో తనకంటూ సెపరేట్ క్రేజ్ ఏర్పరుచుకున్నడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో “బొమ్మరిల్లు” సినిమాతో మంచి గుర్తింపు పొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా సినిమాలు పరాజయం పాలు కావడంతో అవకాశాలు తగ్గటంతో దాదాపు తెలుగు ప్రేక్షకులకు ఎనిమిది సంవత్సరాల పాటు దూరమయ్యాడు. అయితే తాజాగా “RX 100” తో అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ తీసిన అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతున్న సినిమాలో సిద్ధార్థ నటిస్తున్నారు. “మహా సముద్రం” అనే టైటిల్ పేరిట వస్తున్న ఈ సినిమాలో సిద్ధార్థ విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో హీరోగా ప్రేక్షకులను అలరించిన సిద్ధార్థ మొట్టమొదటిసారి విలన్ రోల్ లో అది కూడా రీఎంట్రీ లో రావటం ఒక ప్రయోగం అని చెప్పవచ్చు. మరి హీరోగా సిద్ధార్థ్ అని చూసిన ప్రేక్షకులు విలన్ గా ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.