నెట్టింట వైరల్ అవుతున్న ఒబామా వీడియో..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రస్తుతం దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారంతో బిజీబిజీగా ఉన్నారు. డెమొక్రాటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ తరుపున ప్రచారంలో గడుపుతున్నారు. శనివారం నాటి ప్రచారంలో భాగంగా మిచిగాన్‌లోని ఓ స్కూల్‌కు ఆయన వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి జిమ్‌లోని బాస్కెట్‌ బాల్‌ కోర్టులోకి అడుగుపెట్టి బాల్‌ను నెట్‌లో పడేలా వేశారు. ఆ వెంటనే ‘నాకు ఇంతే వచ్చు!’ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. దీంతో ఆ వీడియో సొషల్ మీడియాలో వైరల్ గా మారింది.