త‌మిళంలో భారీ రేటు ప‌లికిన మ‌హేష్ సినిమా!

వాస్తవం ప్రతినిధి: సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు తెలుగులోనే కాదు త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గ‌తంలో ఆయ‌న న‌టించిన చాలా చిత్రాలు కోలీవుడ్‌లో విడుద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కారు వారి పాట చిత్రాన్ని కూడా త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల‌లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న స‌ర్కారు వారి పాట చిత్రాన్ని త‌మిళంలో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నుండ‌గా, ఈ చిత్రం త‌మిళ శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్‌ని విజ‌య టీవీ ద‌క్కించుకుంద‌ట‌. త‌మిళ భాష‌లో విడుద‌లైన మ‌హేష్ చిత్రాల‌కు ఇంత‌వ‌ర‌కు ఈ రేంజ్ ఆఫర్ రాలేద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం.