మహేష్ సాంగ్స్ స్టార్ట్ అయ్యాయి అంటున్న తమన్..!!

వాస్తవం ప్రతినిధి : ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ అనే సినిమాకి  అదిరిపోయే బాణీలు ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. సినిమా విడుదల అవ్వక ముందే ‘అల వైకుంఠపురములో’ పాటలు సోషల్ మీడియాలో అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. దీంతో సినిమా కూడా అదిరిపోయే రీతిలో ఉండటంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాధించింది. ఇదిలా ఉండగా తాజాగా పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా కి సంబంధించి కంపోజింగ్ స్టార్ట్ అయినట్లు సోషల్ మీడియాలో తమన్ క్లారిటీ ఇచ్చారు. “తాజాగా సర్కారు వారి పాట కోసం లవ్లీ బాణీలను కట్టడానికి సిటింగ్స్ జరిగాయి. సూపర్ స్టార్ మహేశ్ గారి కోసం చక్కని పాటలను ఇవ్వడానికి తగ్గా లవ్లీ సన్నివేశాలను క్రియేట్ చేసిన డార్లింగ్ పరశురామ్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి’ అంటూ తమన్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో జరగనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓ వారం టైమ్ తీసుకుని తర్వాత, సినిమా యూనిట్ వర్క్ పర్మిట్ వీసాల ద్వారా అమెరికా వెళ్లనున్నట్లు టాక్.