లోకేష్ పై విమర్శల వర్షం కురిపించిన మంత్రి కొడాలి నాని..!!

వాస్తవం ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సీరియస్ కామెంట్లు చేశారు. రాజకీయాలలో లోకేష్ వంటి వేస్ట్ మనిషిని తామెక్కడా చూడలేదని కొడాలి నాని పేర్కొన్నారు. వరి చేనుకు, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి అని ఆయన ఎద్దేవ చేశారు. లోకేష్‌ ఎక్కడ తిరిగినా పార్టీకి ప్రయోజనం లేదని, కాని లోకేష్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాగే కొనసాగిస్తే, తగిన బుద్ది చెప్పవలసి వస్తుందని నాని హెచ్చరించారు. కరెంట్‌ ఛార్జీలు తగ్గించమని అడిగితే బషీర్‌ బాగ్‌ వద్ద రైతులపై కాల్పులు జరిపించిన చరిత్ర చంద్రబాబుదని కొడాలి నాని గుర్తు చేశారు. ఇప్పుడు రైతులకు సంకెళ్లు వేశారని దేవినేని ఉమా సంకెళ్ల నాటకం ఆడుతున్నారు. అప్పుడు బషీగ్‌ బాగ్‌ ఘటన సమయంలో ఉమా గన్‌తో ఎందుకు కాల్చుకోలేదు. గుంటూరులో జరిగిన ఘటనలో రైతులు పోలీస్ సిబ్బంది మీద తిరగబడితే సంకెళ్లు వేశామని చెప్పారు. వారిపై ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుందని కొడాలి నాని పేర్కొన్నారు.