జగన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన ఉండవల్లి అరుణ్ కుమార్..!!

వాస్తవం ప్రతినిధి: ఇటీవల ఏపీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్రం తమకు సంబంధం లేదు అన్నట్టు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. కేంద్రం చేసిన వ్యాఖ్యలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా డైలమాలో పడిపోయింది. విభజన చట్ట ప్రకారం జాతీయ ప్రాజెక్టులను కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని కేంద్రం పోలవరం పై చేసిన కామెంట్లకు ఏపీ నేతలు కౌంటర్లు వేశారు.

ఇదిలా ఉండగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ తన స్వార్థం కోసం కేసులను మాఫీ చేసుకునే రీతిలో వ్యవహరిస్తే మాత్రం ఏపీ జనాలు ఉరుకోరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు. న్యాయపరంగా కేంద్రాన్ని అడగవలసిన బాధ్యత ప్రభుత్వానిదే, ఈవిషయంలో బీజేపీతో విడిపోమని ఎవరు అనటం లేదు…పైగా ఇది వైయస్సార్ సంకల్పించిన ప్రాజెక్ట్. కాబట్టి పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయాలి అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీస్తే మిమ్మల్ని జైల్లో పెడతారని.. అని అనుకుంటే, రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని పేర్కొన్నారు. మరోపక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్ధంగా ఆలోచిస్తే… ఏపీ ప్రజలు అంతా గమనిస్తున్నారని జగన్ ని ఉద్దేశించి ఉండవల్లి హెచ్చరించారు.