ట్రంప్ తీరును తప్పుబట్టిన ఒబామా..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరును అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు. ఒబామా మంగళవారం ఫ్లోరిడాలోని ఒర్లాండోలో నిర్వహించిన డ్రైవ్-ఇన్ ఎన్నికల ర్యాలీలో ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన డెమొక్రటిక్ పార్టీ లీడర్‌గా పేరున్న ఒబామా కొన్ని రోజులుగా జో బైడెన్, కమలా హ్యారిస్‌లకు మద్దతుగా ఫ్లోరిడాలో పలు ర్యాలీలలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ను ట్రంప్ ‘హాట్ జోన్’గా మార్చారని దుయ్యబట్టారు. “అతను మొదటి నుండి కొవిడ్‌పై దృష్టిసారించినట్లయితే, కేసులు కొత్త రికార్డు స్థాయికి చేరుకునేవి కావు. ఆయన మొదట్లో కరోనాను తేలికగా తీసుకున్నారు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న పట్టించుకోలేదు. చివరకు వైట్‌హౌస్‌ను ‘హాట్ జోన్’గా మార్చారు” అని ఒబామా మండిపడ్డారు.