శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే॥
ఈ శ్లోకాన్ని పరాశరమహర్షి రచించాడు. ఈయన వ్యాసమహర్షి తండ్రి. రుషి విశిష్టుడైన వశిష్ఠమహర్షి మనవడు.
శుక్లాంబరాలు అంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడిని, విష్ణుత్వం అంటే వ్యాపకత్వం కలిగినవాడిని, నాలుగు చేతులు కలవాడిని, ప్రసన్నమైన ముఖం కలిగినవాడిని సకల విఘ్నాలు తొలగిపోవడానికి ధ్యానం చేస్తున్నాను అని ఈ శ్లోకానికి అర్థం.
శుక్లాంబరధరం- అంటే తెల్లటి వస్త్రాలను ధరించినవాడు అని అర్థం! అంబరం అంటే ‘వస్త్రం’ అనీ ‘ఆకాశం’ అనీ రెండు అర్థాలు ఉన్నాయి.
విష్ణుం అంటే విశ్వమంతా వ్యాపించినవాడు అని అర్థం.
శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగినవాడు అని భావం.
చతుర్భుజం- చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే నాలుగు దిక్కులు కావచ్చు
ప్రసన్నవదనం ధ్యాయేత్- ఆ ప్రసన్న ముఖుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం.
సర్వ విఘ్నోపశాంతయే- సమస్తమైన అడ్డంకులనూ తొలగించాలని కూడా అర్థిస్తున్నాను.
ఇట్లు
కరోతు సురేష్ స్వామి