ఆ రెండు ఫ్యామిలీలను చంద్రబాబు పక్కన పెట్టేసినట్లేనా..??

వాస్తవం ప్రతినిధి: తెలుగు దేశం పార్టీ లో రాజకీయంగా బలమైన నేపథ్యం కలిగిన కుటుంబాలలో భూమా, జెసి కుటుంబాలు. రాజకీయంగా ఈ రెండు కుటుంబాలు రాయలసీమ ప్రాంతంలో ప్రజలను బాగా ప్రభావితం చేశాయి. అటువంటిది తాజాగా పార్టీకి సంబంధించి ప్రకటించిన కొత్త పదవులలో ఈ రెండు కుటుంబాలకు చోటు లేక పోవటం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం కొన్ని దశాబ్దాల నుండి రాజకీయాలలో రాణిస్తోంది. అయితే ఇటీవల వైసీపీ అధికారంలోకి వచ్చాక కేసులు గోల ఎక్కువ అవటంతో కాస్త స్పీడ్ తగ్గించారు జెసి వర్గీయులు. ఇటువంటి తరుణంలో పార్టీకి సంబంధించి ప్రకటించిన పదవులలో ఈ కుటుంబానికి ఎలాంటి పదవీ చంద్రబాబు కట్టకపోవడంతో అనంతపురం జిల్లాలో ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో భూమా కుటుంబంలో అఖిలప్రియ కి కూడా ఎలాంటి పదవీ చంద్రబాబు ఇవ్వకపోవటం తో జెసి అదేవిధంగా భూమా కుటుంబాలను చంద్రబాబు రాజకీయంగా పక్కన పెట్టినట్లేనా అనే డిస్కషన్ లు టిడిపి పార్టీలో జరుగుతున్నాయి.