అమెరికా అధ్య‌క్ష ఎన్నికలు : ప్రీ ఎల‌క్ష‌న్‌ బ్యాలెట్‌లో భారీగా ఓట్లు న‌మోదు..!!

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భాగంగా జ‌రుగుతున్న ప్రీ ఎల‌క్ష‌న్‌ బ్యాలెట్‌లో భారీగా ఓట్లు న‌మోద‌వుతున్నాయి. నవంబ‌ర్ 3న జ‌ర‌గ‌నున్న పోలింగ్‌కు తొమ్మిది రోజుల ముందే 59 మిలియన్ల మంది ఓట‌‌ర్లు త‌మ ఓటుహ‌క్కు వినియోగించుకున్నారు. గ‌త‌ అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్రీ బ్యాలెట్ కంటే ఇర‌వై మిలియ‌న్లు అధికం కావ‌డం విశేషం.

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో రిప‌బ్లిక‌న్ పార్టీ త‌ర‌పున‌ ప్ర‌స్తుత అధ్య‌‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌, డెమొక్రాట్ పార్టీ త‌ర‌పున మాజీ ఉపాధ్య‌క్షుడు జో బైడెన్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఇరువురు నేత‌లు ముమ్మ‌రంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇరువురు అభ్య‌ర్థుల‌ ముఖాముఖి చ‌ర్చ ముగిసింది. అయితే చాలా మంది తారు జో బైడెన్‌నే అధ్య‌క్షుడిగా ఎన్నుకుంటామ‌ని ఎన్నారైలు ఇప్ప‌టికే ప్ర‌క‌టించడం విశేషం.