నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికన్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ : జోబైడెన్‌

వాస్తవం ప్రతినిధి : డెమొక్రాటిక్‌ అభ్యర్ధి జోబైడెన్‌ తన సొంతరాష్ట్రం డెలావర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కరోనాను ట్రంప్‌ కట్టడి చేయలేకపోయారని, అందుకే 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయని విమర్శించారు. ట్రంప్‌ చెప్పినట్లు అమెరికన్లు కరోనాతో జీవించడం నేర్చుకోలదని, మరణించడం నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అందువల్ల కరోనాకు సురక్షితమైన వాక్సిన్‌ తయారు కాగానే, తాను ఎన్నికయిన తర్వాత అందరికీ ఉచితంగా అందిస్తానని వాగ్దానం చేశారు. అధ్యక్షుడు కాగానే కరోనా వాక్సిన్‌ను కావల్సినన్ని డోసులు కొనేలా ఆదేశాలిస్తానని, అప్పుడే దేశంలో ఇన్సూ్యరెన్స్‌ లేని వాళ్లకు కూడా వాక్సిన్‌ అందుతుందని చెప్పారు.