మరికొన్ని రోజుల్లో అమెరికా ఎన్నికలు.. సరికొత్త వివాదంలో ట్రంప్..!!

వాస్తవం ప్రతినిధి : మరికొన్ని రోజుల్లో అమెరికాలో ఎన్నికలు జరగనున్న తరుణంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సరికొత్త వివాదంలో ఇరుక్కున్నారు. తన ప్రత్యర్థి, డెమోక్రాట్ల అభ్యర్థి జో బిడెన్ పై విరుచుకుపడుతున్న నేపథ్యంలో మెలానియాకు డూప్‌ను వెంటబెట్టుకుని తిరుగుతున్నారన్న తాజా వివాదం వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. గతకొన్ని రోజులుగా ట్రంప్ తన వెంట మెలానియాను పోలి ఉన్న మరో మహిళను తీసుకెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన సాక్ష్యాలు, మీమ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెల 22వ తేదీన టెన్నెస్సె స్టేట్‌లోని నాష్‌విల్లేలోని యూనివర్శిటీలో ఏర్పాటు చేసిన డిబేట్‌కు హాజరు కావడానికి ట్రంప్ తన అధికారిక నివాసం వైట్‌హౌస్ నుంచి మెరైన్ వన్ ఎయిర్ క్రాఫ్ట్‌లో బయలుదేరడానికి ముందు తీసిన ఫొటో తాజా వివాదానికి కారణమైంది.

ఎయిర్ క్రాఫ్ట్‌లోకి అడుగు పెట్టడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ తన అభిమానులకు అభివాదరం చేస్తోన్న సమయంలో ఆయన పక్కనే నిల్చుని కనిపించారామె. ఈ ఫోటోలను పరిశీలించిన వారు ఆమె మెలానియా కాదని, మరో మహిళ అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఎవరా ఆ అజ్ఞాత మహిళ అంటూ ‘ఫేక్ మెలానియా’ హ్యాష్‌ట్యాగ్‌ను షేర్ చేస్తున్నారు.