దాయాది దేశం పాకిస్థాన్‌లో భూకంపం..!

వాస్తవం ప్రతినిధి : దాయాది దేశం పాకిస్థాన్‌లో ఇవాళ‌ తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీనితీవ్ర‌త రిక్టర్ స్కేలుపై 4.8గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ప్ర‌క‌టించింది. అయితే, భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సోమవారం ఉద‌యం 4.14 గంటలకు భూకంపం సంభవించింద‌ని, భూ అంత‌ర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించింద‌ని అధికారులు తెలిపారు. అయితే భూకంప కేంద్రం ఎక్క‌డ ఉంద‌నే విష‌యం ఇంకా తెలియ‌రాలేద‌ని వెల్ల‌డించారు.