సీషెల్స్ అధ్యక్షుడిగా ఎన్నారై పూజారి వేవెల్ రామ్‌కలవన్ ..!

వాస్తవం ప్రతినిధి : సీషెల్స్ అధ్యక్షుడిగా బీహార్‌కు చెందిన భారతీయ సంతతి పూజారి వేవెల్ రామ్‌కలవన్ ఎన్నికయ్యారు. రామ్‌కలవన్ నేతృత్వంలోని లిన్యోన్ డెమోక్రాటిక్ సెసెల్వా(ఎల్‌డీఎస్) పార్టీ సీషెల్స్‌లో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకుంది. అలాగే 1977 నుంచి ఇప్పటివరకు సీషెల్స్‌లో ప్రతిపక్ష పార్టీకి అధికారం దక్కలేదు. రామ్‌కలవన్ ఎల్‌డీఎస్ పార్టీ ఈ సెంటిమెంట్‌కు స్వస్తి పలికి కొత్త చరిత్ర సృష్టించింది. దీంతో మూడు దశాబ్దాల తర్వాత సీషెల్స్‌లో ఓ కొత్త పార్టీకి అధికారం దక్కినట్లైంది.