కాస్త కుదుట పడిన రాజశేఖర్ ఆరోగ్యం..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో రాజశేఖర్ ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ కి కరోనా రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయన త్వరగా కోలుకోవాలని అభ్యర్థించడం జరిగింది. ఈ క్రమంలో రాజశేఖర్ కూతురు శివాని కూడా తన తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉండాలని అందరూ భగవంతునికి ప్రార్థన చేయాలి అని సోషల్ మీడియా ద్వారా కోరింది. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ ఏర్పడటంతో శ్వాసతీసుకోవడంలో సమస్య ఏర్పడిందని వైద్యులు తెలిపారు. కాగా తాజాగా రాజశేఖర్ ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్ విడుదల చేసారు వైద్యులు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ అవసరం లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. అదే విధంగా రాజశేఖర్ సతీమణి జీవిత కు కరోనా నెగిటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జ్ చేసారు వైద్యులు.