కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అయిన త్రివిక్రమ్..??

వాస్తవం సినిమా : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ ఏడాది “అల వైకుంఠపురం లో” సినిమాతో ఇండస్ట్రీకి మర్చిపోలేని హిట్ ఇచ్చాడు. కరోనా వైరస్ రావటంతో స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది ఏది కూడా రిలీజ్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేకపోవటంతో, సంక్రాంతి పండుగకు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన “అల వైకుంఠపురం లో” సినిమాయే ఈ ఏడాది అతి పెద్ద భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా కన్ఫామ్ అయిపోయింది.

ఇదిలా ఉండగా నెక్స్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ భావించినా “ఆర్ఆర్ఆర్” సినిమా ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో ఈ లోపు టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోతో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

పూర్తి విషయంలోకి వెళితే “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో గత ఏడాది మాస్ విజయాన్ని అందుకున్న రామ్ పోతినేని తో సినిమా చేయాలని త్రివిక్రమ్ డిసైడ్ అయినట్లు టాక్. ఇప్పటికే కథ చెప్పినట్లు, అంతా ఓకే అయినట్లు, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ టాక్.