అమీర్ ఖాన్ ని టార్గెట్ చేసిన కంగనా రనౌత్..!!

వాస్తవం సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై కాంట్రవర్సి కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సుశాంత్ సింగ్ సూసైడ్ కేసు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో మొన్నటి వరకు వార్తల్లో నిలిచిన కంగనారనౌత్ ఆమెపై ఇటీవల దేశద్రోహం కేసు కూడా నమోదు అవ్వడం తెలిసింది. పరిస్థితి ఇలా ఉండగా మరో పక్క తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ని టార్గెట్ చేసింది. లక్ష్మీ భాయ్ కోటను కూల్చినట్టే నా ఇంటిని కూలేచేస్తారు. తిరుగుబాటు చేసినందుకు సావర్కర్ జైలు శిక్ష అనుభవించినట్లే నన్ను కూడా జైల్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. నేను ఎవ్వరికి తలవంచను . ఈ అసహనపు దేశంలో ఎన్ని కష్టాలు పడ్డారో అసహనపు గ్యాంగ్ ను అడగండి” అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు అమీర్ ఖాన్ ను ట్యాగ్ చేసింది కంగనా. గతంలో అమీర్ ఖాన్ కేంద్ర ప్రభుత్వంపై అసహనం అంటూ దేశం విడిచి వెళ్లిపోవాలి అని ఉందని కామెంట్లు చేయడం జరిగింది. అప్పట్లో అమీర్ ఖాన్ చేసిన కామెంట్లు పెను దుమారాన్ని రేపాయి. ఇటువంటి తరుణంలో మరోసారి కంగనారనౌత్ అమీర్ ఖాన్ అప్పట్లో చేసిన వ్యాఖ్యలను తాజాగా ప్రస్తావించడం తో సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అయింది.