సంక్రాంతికి రాబోతున్న రామ్..??

వాస్తవం సినిమా: వరస ఫ్లాపుల్లో ఉన్న ఎనర్జిటిక్ హీరో రామ్ గత ఏడాది పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం స్రవంతి రవి కిషోర్ నిర్మాణ సారథ్యంలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో “రెడ్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. సినిమా వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది. కానీ మహమ్మారి కరోనా వైరస్ రావటంతో వాయిదా పడింది. ఆ తర్వాత లాక్ డౌన్ టైం లో ఓటిటి లో రిలీజ్ అవుతుందని భావించినా గాని రిలీజ్ కాలేదు. కానీ తాజాగా ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ ఇటీవల దసరా పండగ రోజు క్లారిటీ ఇచ్చింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా లో రామ్ సరసన అందాల భామ నివేద పేత్ రాజ్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. .