నవంబర్ నెలాఖరు కల్లా “వకీల్ సాబ్” సినిమా కంప్లీట్..??

వాస్తవం సినిమా: దసరా పండుగ సందర్భంగా ఎవరు ఊహించని రీతిలో పవన్ కళ్యాణ్ అభిమానులకు అదరగొట్టే న్యూస్ ఎనౌన్స్ చేశారు. తన కొత్త సినిమా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న పవన్… హరీష్ శంకర్, క్రిష్ సినిమాలను లైన్ లో పెట్టడం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా చేస్తున్నట్లు దసరా పండుగకు రిలీజ్ చేసి ఫ్యాన్స్ ని జోష్ లో నింపిన పవన్, తాజాగా రీ ఎంట్రీ “వకీల్ సాబ్” సినిమాని ఒకేసారి కంప్లీట్ చేయడానికి డిసైడ్ అయ్యారట. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరియు సినిమా యూనిట్ సరికొత్త షెడ్యూల్ రెడీ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. సినిమాకి సంబంధించిన బ్యాలెన్స్ టాకీ మొత్తం ఒకే షెడ్యూల్లో పూర్తి చేయడం కోసం ఇటీవల సరికొత్త సెట్ వేయటం జరిగిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. కేవలం ఈ సినిమాకి సంబంధించి రెండు వారాల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయబోతున్నట్లు సమాచారం.