తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా

వాస్తవం ప్రతినిధి: తెలంగాణలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 582 కొత్త పాజిటివ్‌ కేసులు, నాలుగు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే ఆదివారం రోజున 1,432 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 2,11,912 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,834కి పెరిగింది.