నా ఆరోగ్యం గురించి ఎవరూ ఆందోళనకు గురికావద్దు: అజిత్ పవార్

వాస్తవం ప్రతినిధి: మహారాష్ట్రకు చెందిన పలువురు మంత్రులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. కాగా తాజాగా  డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌కు కరోనా సోకింది. సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా ఫలితం వచ్చినట్లు ఆయన తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉన్నదని   అజిత్‌ పవార్‌ చెప్పారు.

అయితే వైద్యుల సలహా మేరకు ముంబైలోని బ్రీచ్‌ కాండీ ఆసుపత్రిలో చేరినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురికావద్దని అన్నారు. కొంత విశ్రాంతి తర్వాత తిరిగి అందుబాటులో ఉంటానని చెప్పారు. మరోవైపు మొత్తం కరోనా కేసుల సంఖ్య 16 లక్షలు దాటగా ఇప్పటి వరకు 43 వేల మందికిపైగా మరణించారు.