ఓంకారం…సృష్టిసారం!

ఓం….కారము ఒక అక్షరము. అనగా నాశనము లేనిది. ఓం… కారము లేని మంత్రము మంత్రము కాదు. మంత్రము ఎవరు రాసినది, చెప్పినది కాదు. ఋషులకు వినిపించిన అత్యంత శక్తి వంతములగు శబ్దము లేదా శబ్ద సమూహములు. ‪‎ఓం‬, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది.

ౠగ్వేదంనుండి ‘ఆకారం, యజుర్వేదం నుండి ‘ఊకారం, సామవేదం నుండి ‘మాకారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు. సకలవేదరూపం ఓంకారం.”అకార, ఉకార, మకార శబ్దములతో ఏర్పడిన ‪ఓంకారం‬. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. హిందూమతానికి కేంద్ర బిందువు. పరమాత్మకు శబ్దరూప ప్రతీక. దీనికి నాలుగు పాదాలున్నాయి. అకారం జాగృదావస్థకు, ఉకారం స్వప్నావస్థకు, మకారం సుషుప్తావస్థకు శబ్దరూప ప్రతీకలు. వాటికి అతీతమైన తురీయావస్థకు ప్రతీక శబ్దరహితమైన ఓంకారం. దాన్ని గ్రహించినవాడు తనను పరమాత్మతో ఏకం చేసుకోగలడు. ఇదొక ఏకాక్షర మంత్రము. ఈ మంత్రము నా స్వరూపమే. … నుండి నాదము పుట్టి ఈ మంత్రము ఐదు విధములుగా విస్తరించి, మరల ఐదు కలిసి ఒక్కటియై, ఓం అనే ఏకాక్షర మంత్రము అయెనది దీనినుండి అకారాది వరుస, మరియు నకారాది వరుసలో పంచాక్షర మంత్రము పుట్టెను.

ఓంకారమ్మది తుమ్మెద ”‪‎ఝుంకారము‬ వోలె నుండు జూడగ మదిలో సంకాశము గలిగించున హంకారములే నశించు నానాదముతో. ఓం నమశ్శివాయ ,శివాయ నమః!! ఓం అనే పరబ్రహ్మములో మిగిలిన మూడు బీజములు (ఐం, హ్రీం, శ్రీం) అంతర్లీనమై యుంటాయి. ”ఓం కారము బ్రహ్మాయెను హ్రీం కారము విష్ణు వయ్యె నిజముగ నిలలో ఐం కారము శర్వాణిగ శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్.”

ఇట్లు
కరోతు సురేష్ స్వామి