లోకేష్ అనంతపురం పర్యటనలో బయటపడ్డ విభేదాలు…!!

వాస్తవం ప్రతినిధి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల అనంతపురం జిల్లా పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలో అనంతపురం టిడిపి పార్టీలో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయి. జెసి వర్గం వర్సెస్ పరిటాల వర్గం అన్నట్టుగా సీన్ మారిపోయింది. కారణం చూస్తే లోకేష్ పర్యటన చాలా వరకు జెసి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చే రీతిలో ఉండటంతో పరిటాల వర్గానికి చెందిన మద్దతుదారులు రగిలిపోయి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు టాక్.

అనంతపురం పర్యటన లో పరిటాల వర్గం మాత్రమే కాకుండా మాజీ మంత్రులు కాల్వ శ్రీనివాసులు కూడా లోకేష్ పర్యటన పై అసహనం చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఎప్పటినుండో అనంతపురం జిల్లాలో టిడిపి పార్టీకి మద్దతుగా ఉన్న కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా… లోకేష్ పర్యటన జిల్లా టిడిపి వర్గానికి చెందిన క్యాడర్ కూడా కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

టీడీపీని జిల్లాలో అణిచివేసే రీతిలో వ్యవహరించిన జెసి కుటుంబానికి ఈ విధంగా లోకేష్ వత్తాసు పలకడం దారుణమని… అనంతపురం టిడిపి క్యాడర్ లో కొంతమంది అంటున్న టాక్. ఏది ఏమైనా ఒకానొక సమయంలో లోకేష్ పర్యటన చేస్తే టీడీపీ శ్రేణులు అంతా నిరాజనం పలికేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అవుతున్న తరుణంలో… లోకేష్ పర్యటనలు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి.