లోకేశ్‌కు తప్పిన పెను ప్రమాదం!

lokesh

వాస్తవం ప్రతినిధి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు పెను ప్రమాదం తప్పింది. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో ఉన్న ఆయన ట్రాక్టర్ ప్రమాదానికి గురైంది. దీంతో స్థానికులు అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పింది. ఆకివీడు ప్రాంతంలో పర్యటిస్తున్న లోకేశ్ పార్టీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్‌పై వెళ్లారు. ఈ క్రమంలో లోకేశ్‌ ట్రాక్టర్‌ నడుపుతుండగా అది కాల్వ వైపు ఒరొగింది. వెంటనే తేరుకుని ట్రాక్టర్‌ను అదుపు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.