బొగ్గు కుంభ‌కోణంలో కేంద్ర మాజీ మంత్రి కి మూడేళ్లు జైలు శిక్ష!

వాస్తవం ప్రతినిధి: 1999లో వాజ్ పేయి ప్రభుత్వంలో జ‌రిగిన బొగ్గు కుంభ‌కోణంలో కేంద్ర మాజీ మంత్రి దిలిప్ రే కి మూడేళ్లు జైలు శిక్ష , 10 లక్షల జరిమానా పడింది. ఈ కేసును విచారించిన సిబిఐ కోర్టు నేడు తీర్పును వెలువ‌రించింది.. ఈ కోల్ కుంభ‌కోణంలో దిలిప్ రే పాత్ర నిర్ధార‌ణ కావ‌డంతో మూడు ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ఇదే కేసులో మ‌రో ఇద్ద‌రికి కూడా జైలు శిక్ష విధించింది.అయితే మధ్యాహ్నానికి సీన్ మారింది. తమ వయస్సు రీత్యా తమకు బెయిల్ ఇవ్వాలని ఈ దోషులు కోర్టును కోరారు. దీంతో దిలీప్ రే కి సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో ఇతనితో బాటు మరో ఇద్దరు మాజీ అధికారులకు కూడా బెయిల్ లభించింది. హైకోర్టులో అప్పీలు చేసుకోవడానికి వీరికి వచ్ఛేనెల 25 వరకు కోర్టు గడువునిచ్చింది.