గత ప్రభుత్వ తప్పులు కోసం లక్ష మందిని బలి చేయడం సరికాదు: అనిల్ కుమార్ యాదవ్

వాస్తవం ప్రతినిధి: కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలను, పోలవరంను నట్టేట ముంచిది చంద్రబాబే అని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండి పడ్డారు. అర్ అండ్ అర్ కి సంబంధించి వివరాలు అన్ని అందించామని..టీడీపీలో మాట్లాడే వారికి వాళ్ళ నాయకుడు రాసిన లేఖ గురించి కూడా తెలియదన్నారు. ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన అంచనాల ప్రకారం నిధులు చెల్లించాలని కోరుతామని..ప్రాజెక్ట్ కేంద్రం పూర్తి చేస్తుందా, లేక రాష్ట్రమా అనేది తర్వాత విషయమన్నారు. గత ప్రభుత్వ తప్పులు కోసం లక్ష మందిని బలి చేయడం సరికాదని.. వారంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సమావేశం ఉంటుందని.. అధికారులు ఆ సమావేశంలో పాల్గొంటారన్నారు. మేము పెట్టుకున్న లక్ష్యం లోపు పోలవరం పూర్తి చేయాలనే నిబద్దతతో ఉన్నామని..డ్యాం కట్టడం వల్ల పోలవరం పూర్తి కాదు…. లక్ష కుటుంబాలు ముఖ్యమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.