అరాచక పాలన అంటూ ట్విట్టర్ లో జగన్ పై లోకేష్ ఫైర్…!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మరోసారి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లా దేవనకొండ మండలం, పాలకుర్తి లో రాజకీయ కక్షలతో జగన్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అయిన హర్ష వర్ధన్ రెడ్డి బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఏ 5 ముద్దాయి అని నారా లోకేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే సీఎం జగన్ తో సన్నిహితంగా ఉన్న ఒక ఫోటోను సైతం జతచేసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే ఆయనను కేసునుండి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి బాధితురాలిని బెదిరించడం జగన్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనం అంటూ నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను అని ఈ సందర్భంగా లోకేష్ కోరారు.