రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

వాస్తవం ప్రతినిధి: రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రతిరోజు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో 3 వేల టోకెన్లను టీటీడీ జారీ చేయనుంది. 2 నెలలు విరామం తర్వాత సర్వదర్శనం టోకెన్ల జారీ చేస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల జారీని రద్దు చేసిన టీటీడీ.. సెప్టెంబరు 10నుంచి ఆ 3వేల కోటాను రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మళ్లించింది. టికెట్ల సంఖ్యను విడతల వారీగా పెంచుతూ ప్రస్తుతం రోజుకు 16వేల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా విక్రయిస్తున్నారు. వీటితో పాటు వీఐపీలకు బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి ట్రస్టుకు రూ.10వేలు విరాళాన్ని ఇచ్చిన భక్తులకు, బోర్డు సభ్యుల సిఫారసుపై రూ.300 సుపథం ప్రవేశం, రూ.వెయ్యితో ఆన్‌లైన్‌ కల్యాణోత్సవం టికెట్లు కొన్నవారికి ప్రస్తుతం దర్శనం చేయిస్తున్నారు.