ఆమె లేని లోకం తానూ వద్దనుకొని..సమాధి వద్దకు వెళ్లి..

వాస్తవం ప్రతినిధి:   ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో చనిపోయింది. దీంతో మహేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని ఈ లోకంలో తాను ఉండకూడదని భావించాడు. ఆదివారం నాడు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లిన మహేశ్ ఉరి వేసుకుని మృతిచెందాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

ఈ ఘటనలతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. బంధువులు, సన్నిహితులు, స్థానికులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది