బిడెన్‌, హ్యారిస్‌ జోడీనే దేశాన్ని తిరిగి గాడిలో పెట్టగలదు :ఎన్నారై పారిశ్రామికవేత్త

వాస్తవం ప్రతినిధి : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్‌కే మెజారిటీ ఇండియన్‌ అమెరికన్లు మద్దతు పలుకుతున్నారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను అవమానపరుస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ను భారత్‌కు విరోధిగా అభివర్ణిస్తున్నారు. సిలికాన్‌ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత్త అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘నాలుగేండ్ల ట్రంప్‌ పాలనలో ఇంతకుముందు ఉన్నట్లుగా మాకు, మా పిల్లలకు అవకాశాలు లేవు. మన కమ్యూనిటీని, మన విలువలను గౌరవించే వ్యక్తి, సమాన అవకాశాలు కల్పించే వ్యక్తి అధ్యక్షుడు కావాల్సిన అవసరం ఉన్నది’ అని ఆయన పేర్కొన్నారు.