ఆసుపత్రినుంచి డిశ్చార్జ్..నిలకడగా కపిల్ ఆరోగ్యం

వాస్తవం ప్రతినిధి: టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌కు రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చిన విషయం తెల్సిందే. గత శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంటకు ఆయనకు ఛాతిలో తీవ్ర నొప్పి వచ్చింది. దాంతో అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఢిల్లీలోని ఓఖ్లా రోడ్డులో ఉన్న ఫోర్టిస్ ఎస్కార్ట్స్‌ హార్ట్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడ డాక్టర్లు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారు.

గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ ద్వారా వాటిని పునరుద్ధరించారు. ప్రస్తుతం కపిల్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన్ను డిశ్చార్జ్ చేశారు.