ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలి ..దేశప్రజలకు ప్రధాని మోదీ దసరా శుభాకాంక్షలు !

వాస్తవం ప్రతినిధి: ఈ దసరా ప్రజలకు స్ఫూర్తినివ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ… దేశ సరిహద్దుల్లో పహారా కాస్తూ… ప్రజలకు భద్రత కల్పిస్తున్న సైన్యానికి సలాం చేస్తూ  ప్రతి ఒక్కరూ దీపాలు వెలిగించాలని..ఈ రోజు నిర్వహించిన మన్ కి బాత్‌ కార్యక్రమం ద్వారా ప్రధాని మోదీ కోరారు.

దీపావళి, ఈద్‌ వంటి పండుగల సమయంలోనూ సైనికులు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశాన్ని కాపాడుతున్నారని ఆయన తెలిపారు. వారికి మద్దతుగా పండుగ రోజు ప్రజలు ఇళ్లలో దీపాలు వెలిగించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో పండుగలు జరుపుకొనేటప్పుడు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ పోరులో మనం తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పారు. దేశ ప్రజలు స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనాలని ఆయన తెలిపారు. పండుగ సందర్భాల్లో స్థానిక వస్తువులనే కొనుగోలు చేయాలన్నారు.