పండుగనాడు విషాదం..ఐదుగురు మహిళలు దుర్మరణం

వాస్తవం ప్రతినిధి: వనపర్తి జిల్లాలో విజయదశమి పండుగనాడు విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బుద్దారం గ్రామంలో ఇంటి పై కప్పు కూలడంతో, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మహిళలు దుర్మరణం పాలయ్యాారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అర్థరాత్రి తరువాత ఈ ఘటన జరగడంతో ఇంట్లోని వారు నిద్రలోనే సమాధి అయ్యారు. మృతులను మణెమ్మ, ఆమె కోడళ్లు సుప్రజ, ఉమాదేవి, మనవరాళ్లు వైష్ణవి, పింకిగా గుర్తించారు.