కరోనా మహమ్మారి వల్ల ఆ దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు.. టెడ్రోస్ అధనోమ్ కీలక వ్యాఖ్యలు..!

వాస్తవం ప్రతినిధి : కరోనా వ్యాప్తి, మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్‌-19 మహమ్మారిలో ప్రపంచం ఇప్పుడు ఒక క్లిష్టమైన దశలో ఉందని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ అధ్యక్షుడు టెడ్రోస్ అడానమ్ గెబ్రైసిస్‌ శుక్రవారం వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరార్థ గోళంలో కరోనా విజృంభణ విపరీతంగా ఉందని, ఆయ దేశాలు ప్రమాదకర మార్గంలో పయనిస్తున్నాయని టెడ్రోస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశాల్లో వైద్య, ఆరోగ్య సేవల వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితి ఉందని హెచ్చరించారు.

‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనే నేపథ్యంలో మనం ఇప్పుడు కీలకమైన స్థితిలో ఉన్నాం. రాబోయే కొన్ని నెలలు ఇండియా, చైనా, రష్యా, కెనడా, అమెరికా, యూకే, జర్మనీ లాంటి పలు దేశాలకు మరింత కఠినంగా మారబోతున్నాయి. అందుకే మరణాలను తగ్గించడం, అవసరమైన హెల్త్ సర్వీసెస్‌‌ కుప్పకూలిపోకుండా చూసుకోవడంతోపాటు స్కూళ్లు మూతబడకుండా తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఆయా దేశాధినేతలను మేం కో్రుతున్నాం. ఫిబ్రవరిలో చెప్పిన విషయాలనే నేను మళ్లీ రిపీట్ చేస్తున్నా’ అని టెడ్రోస్ పేర్కొన్నారు.