దసరాకి సరికొత్త రికార్డు టార్గెట్ చేసిన పవన్ ఫ్యాన్స్..!!

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు. ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ కి సొంతం. దాదాపు పది సంవత్సరాలు సూపర్ హిట్ పడకపోయినా, రెండు సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉండి సినిమా రాకపోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ చెక్కు చెదరలేదు అని చాలా సర్వేలు, చాలా సందర్భాలలో బయట పెట్టడం జరిగింది. ఇక సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ అభిమానులు రికార్డులు సృష్టించడం కాదు గిన్నిస్ రికార్డులు నెలకొల్పిన సందర్భాలు ఉన్నాయి.

ఇటువంటి నేపథ్యంలో ఈ దసరా పండుగకు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా “వకీల్ సాబ్” టీజర్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో…యూట్యూబ్ లో అనేక స్టార్ హీరోల అభిమానులు పగలగొట్టాలని ప్రయత్నించి ఫెయిల్ అయిపోయిన రికార్డును పవన్ ఫ్యాన్స్ టార్గెట్ చేసినట్లు టాక్.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ రామరాజు ఫర్ భీమ్ వీడియోకు నందమూరి ఫ్యాన్స్ మిలియన్ లైక్స్ రికార్డును ట్రై చేశారు. 24 గంటల్లో మిలియన్ యూట్యూబ్ లైక్స్ కోసం వారు తీవ్రంగా ప్రయత్నించారు. కొద్ది తేడాలో మిస్ అయ్యింది. కేవలం 70 వేల లైక్స్ తేడాతో 24 గంటల్లో మిలియన్ లైక్స్ రికార్డును మిస్ చేసుకున్నారు.

ఇప్పుడు ఆ రికార్డును పగలగొట్టాలని పవన్ అభిమానులు డిసైడ్ అయిపోయారు. ఈ సందర్భంగా దసరా కానుకగా రిలీజ్ కాబోతున్న “వకీల్ సాబ్” మూవీ టీజర్ తో ముహూర్తం ఫిక్స్ చేశారు. గతంలోనే అనేక రికార్డులు సృష్టించిన పవన్ ఫ్యాన్స్ కి ఈ రికార్డు పెద్ద విషయమేమీ కాదని సినిమా విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.