ప్రభాస్ కి స్పెషల్ విషెస్ చెప్పిన దీపికాపదుకొనె..!!

వాస్తవం సినిమా: అక్టోబర్ 23 వ తారీకు ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్… ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో “రాధేశ్యామ్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ప్రభాస్ లుక్ కి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులను అలరించారు సినిమా యూనిట్. కాగా తర్వాత ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో చేయబోయే భారీ బడ్జెట్ సినిమాల్లో హీరోయిన్ గా చేయబోతున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొనే తాజాగా ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. హ్యాపీ బర్త్ డే ప్రభాస్, మీరు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని తెలిపారు, ఈ ఏడాది మీకు అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అని దీపికా పడుకొనే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అయితే దీపికా పడుకొనే విషెస్ తెలియజేయడం తో ప్రభాస్ అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.