తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదే అంటున్న సోనూసూద్

వాస్తవం ప్రతినిధి : కోల్‌‌కతాలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన మండపంలో కొందరు భక్తులు సినీనటుడు సోనూ సూద్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయన పట్ల తమ ప్రేమాభిమానాలను చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌‌కతాలో ప్రఫుల్లా కనక్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోనూ సూద్‌ విగ్రహాన్ని పెట్టారు. ఆయన కార్మికులకు చేసిన సాయాన్ని తెలిపేలా కార్మికులు, బస్సుల బొమ్మలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కొందరు ట్విట్టర్ లో పోస్ట్ చేయగా దీనిపై సోనూ సూద్‌ స్పందించాడు. తనకు జీవితంలో లభించిన అతిపెద్ద పురస్కారం ఇదేనని అన్నాడు.