అగ్రరాజ్యంలో 11 మంది భారతీయ విద్యార్థులు అరెస్ట్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో అక్రమంగా నివాసముంటున్న 11 మంది భారతీయులతో సహా 15 మంది విదేశీ విద్యార్థులను ఆ దేశ పోలీసులు అరెస్ట్ చేశారు. యూఎస్ ఇమిగ్రేషణ్ అధికారులు ఇచ్చిన సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. బోస్టన్‌‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)’ అనే వెసులుబాటుని ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఆరోపించారు. విద్యార్థుల చదవిన రంగంలో ఒక ఏడాది పాటు పనిచేసే అవకాశం ఓపీటీ కల్పిస్తుంది. కానీ, వీరంతా ఎక్కడా ఉద్యోగం చేయకుండానే ఓపీటీ అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు అధికారులు ఆరోపించారు.