తన ప్లేస్ లోకి కోడలిని రప్పిస్తున్న నాగార్జున..!!

వాస్తవం సినిమా: ప్రస్తుతం తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది బిగ్ బాస్ రియాల్టీ షో. గత మూడు సీజన్ లలో కంటెస్టెంట్ లో అదరగొట్టడంతో నాలుగో సీజన్ లో ఆడుతున్న సభ్యులు కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఇంటి సభ్యులను కన్ఫ్యూజ్ చేస్తుండగా… చూస్తున్న ప్రేక్షకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. ఇదిలా ఉండగా సీజన్ త్రీ కి హోస్ట్ గా వ్యవహరించిన నాగార్జున… ప్రస్తుతం కూడా ఆయనే… రాణిస్తున్నారు. కాగా ఈ వీకెండ్ నాగార్జున షోకి వచ్చే అవకాశం ఉండదని తన తాజా చిత్రం “వైల్డ్ డాగ్” కోసం ఇతర రాష్ట్రాల్లో షూటింగులో ఉండిపోయారట. అక్కడ నుంచి రావటం కుదరకపోవడంతో… ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి కొత్త హోస్ట్ గా నాగార్జున తన ప్లేస్ లోకి కోడలు పిల్ల సమంతాని రప్పిస్తున్నారు అనే టాక్ బయట వినబడుతోంది. దీంతో ఈ వార్త విన్న సమంత అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.