అటువంటి వార్తలు నమ్మొద్దంటూ జీవితా రాజశేఖర్ దండం పెడుతుంది..!!

వాస్తవం సినిమా:  టాలీవుడ్ సీనియర్ నటుడు హీరో రాజశేఖర్ కి కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్ సహాయంతో వైద్యులు రాజశేఖర్ కి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలో వైద్యానికి రాజశేఖర్ బాగానే స్పందిస్తున్నారని కుటుంబీకులు ఇప్పటికే తెలిపారు. ఇదిలా ఉండగా వెబ్ మీడియా లో రాజశేఖర్ హెల్త్ పై వస్తున్న వార్తలను ఆయన కుమార్తె శివాత్మిక ఖండిస్తూ నాన్నగారి ఆరోగ్యం అంతా బాగానే ఉందని తెలిపింది. అంతేకాకుండా ఆసుపత్రి వైద్య వర్గాలు సైతం రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ బులిటెన్ కూడా రిలీజ్ చేశారు. ఐసీయూ చికిత్స కొనసాగుతోంది. రాజశేఖర్ ఇస్తున్న ట్రీట్మెంట్ కి స్పందిస్తున్నారని త్వరగా కోలుకుంటారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటువంటి క్రమంలో ఎలక్ట్రానిక్ మీడియాలో రాజశేఖర్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వదంతులు ప్రచారం అయిపోయాయి. దీంతో రాజశేఖర్ భార్య జీవిత రాజశేఖర్ రంగంలోకి దిగి… వస్తున్న వదంతులను నమ్మవద్దు అంటూ తన భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని జీవిత వెల్లడించింది. అంతేకాకుండా బతికున్న సమయంలో ఎలాంటి ప్రచారం చేయటం బాధకు గురిచేస్తుంది అనే రీతిలో దండం పెట్టి మరి వస్తున్న వార్తలను జీవిత ఖండించాలి అని కోరినట్లు సమాచారం.