నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోదీ 

వాస్తవం ప్రతినిధి బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడ్డాయి. తొలి దశ ఎన్నికలకు మరో నాలుగు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ, బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. నేటి నుంచి రాష్ట్రంలో ఆయన విస్తృతంగా పర్యటించి, పలు ర్యాలీలు, రోడ్ షోలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా నేడు ససారమ్, గయ, భాగల్ పూర్ ప్రాంతాల్లో మోదీ ర్యాలీ జరుగనుంది.

బీజేపీ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం, మొత్తం 12 ర్యాలీల్లో పాల్గొనే మోదీ, ఎన్డీయే తరఫు అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు. 28న దర్భంగా, ముజఫర్ పూర్, పట్నాల్లో, నవంబర్ 3న ఛాప్రా, ఈస్ట్ చంపారన్, సమస్తిపూర్ ప్రాంతాల్లోనూ, ఆపై వెస్ట్ చంపారన్, సహస్ర, అరారియా తదితర ప్రాంతాల్లో మోదీ ప్రచారం సాగనుంది.