మీరు సీ ఎం అన్న విషయాన్ని మర్చిపోతే ఎలా? : రఘురామకృష్ణరాజు

వాస్తవం ప్రతినిధి : ఇటీవల పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ తన ప్రసంగంలో డీజీపీని ఉద్దేశించి ‘సవాంగ్ అన్నా’ అని సంబోధించారు. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు.

“నిన్న సీఎం జగన్ గారి అద్భుత వాక్ ప్రవాహంలో భాగంగా డీజీపీని ‘గౌతమ్ సవాంగ్ అన్నా’ అని సంబోధించారు. మీరు మీరు ప్రేమించుకోండి సార్ తప్పులేదు, కానీ పబ్లిక్ లో ‘అన్నా’ అని పిలవడం బాగాలేదు. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని మీరు మర్చిపోతే ఎలా!” అన్నారు. చాటుగా ప్రేమించుకుంటే ప్రేమించుకున్నారు కానీ ఇలా బహిరంగంగా అన్నా, తమ్ముడూ అనుకోవద్దని సూచించారు.